ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథం

7 Feb, 2018 14:34 IST|Sakshi

సాక్షి, ముంబై : రిజర్వ్‌ బ్యాంక్‌​ ఆఫ్‌ ఇండియా పాలసీ రివ్యూను ప్రకటించింది. ఆర్‌బీఐ చేపట్టిన త్రైమాసిక సమీక్షలో అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోను 6.0 శాతంగా, రివర్స్‌ రెపోను 5.75 శాతంగానే ఉంచుతున్నట్టు తెలిపింది. ఆరుగురు మానిటరీ పాలసీ సభ్యుల్లో అయిదుగురు  యథాతథానికి ఓటు వేసినట్టు తెలుస్తోంది. దీంతో నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లలో పాజిటివ్‌ ధోరణి కనిపిస్తోంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఆఖరి పరపతివిధాన సమీక్ష ఇది.  దేశ వినియోగదారుల ద్రవ్యోల్బణం డిసెంబరులో 5.21 శాతంతో 17 నెలల గరిష్ఠ స్థాయిని తాకింది.   గ్లోబల్ అనిశ్చితి ,  ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆర్‌బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు. 

మరోవైపు ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్ల నిర్ణయంతో స్టాక్‌మార్కెట్లు స్పందిస్తున్నాయి. ఆరంభంలో డబుల్‌ సెంచరీ లాభాలను సాధించిన సూచీలు లాభనష్టాలమధ్య ఊగిసలాడుతూ ఫ్లాట్‌గా మారాయి.
 

మరిన్ని వార్తలు