ఉద్యోగ కల్పవృక్షాలు... ఈరంగాలు

5 Jun, 2017 01:31 IST|Sakshi
ఉద్యోగ కల్పవృక్షాలు... ఈరంగాలు

రియల్టీ, రిటైల్, లాజిస్టిక్స్‌..
న్యూఢిల్లీ: నిర్మాణరంగం, రియల్‌ ఎస్టేట్, రిటైల్, రవాణా, లాజిస్టిక్స్‌ రంగాలు సమీప భవిష్యత్తులో అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయి. నిర్మాణం, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో 2013 నాటికి 4.5 కోట్ల ఉద్యోగాలు ఉండగా, మరో 3.1 కోట్ల మంది అవసరం ఉన్నట్టు అసోచామ్‌ నివేదిక పేర్కొంది.

వ్యవస్థీకృత రిటైల్‌ రంగం కోటికి పైగా ఉద్యోగావకాశాలను రానున్న ఐదేళ్లలో అందించనుందని, టెక్స్‌టైల్స్‌ రంగంలోనూ ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని పేర్కొంది. ‘‘ఐటీ, ఐటీ ఆధారిత రంగాలు ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్నాయి. ఉద్యోగ కల్పన నిదానంగా ఉండనుంది. 2022 నాటికి ఈ రంగంలో 22 లక్షల ఉద్యోగాలు అవసరమని నివేదిక వివరించింది.

మరిన్ని వార్తలు