అట్టహాసంగా నరెడ్కో ప్రాపర్టీ షో

7 Oct, 2023 11:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (నరెడ్కో) తెలంగాణ 13వ ప్రాపర్టీ షో హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రభుత్వ చీఫ్‌ విప్, ఎమ్మెల్సీ టీ భానుప్రసాద్‌ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్లవాత్మక విధానాలతో ఐటీ రంగంతో పాటు ఫార్మా, ఏవియేషన్, ఆటోమొబైల్‌ వంటి అన్ని రంగాలలో జోరుగా పెట్టుబడులు వస్తున్నాయని, దీంతో ఆయా రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.

బహుళ జాతి కంపెనీలకు హైదరాబాద్‌ పెట్టుబడుల కేంద్రంగా మారిందని చెప్పారు. ఐటీ ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, దీంతో గృహ విభాగంలో డిమాండ్‌ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో హైదరాబాద్‌తోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలలో కూడా స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. జిల్లాలో పట్టణీకరణ పెరగడంతో చాలా మంది కొనుగోలుదారులు ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. (డ్రీమ్‌ హౌస్‌ కొనేముందు...వీటి కోసమే వెదుకుతున్నారట!)

నరెడ్కో తెలంగాణ ప్రెసిడెంట్‌ బీ సునీల్‌ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. మెరుగైన మౌలిక వసతులు, కనెక్టివిటీతో ప్రధాన నగరంతో పాటు శివారు ప్రాంతాలలో రియల్‌ ఎస్టేట్‌ పరుగులు పెడుతుందని చెప్పారు. స్థిరాస్తిలో పెట్టుబడులకు ఇదే సరైన సమయమన్నారు.  జనరల్‌ సెక్రటరీ విజయసాయి మేక మాట్లాడుతూ.. నరెడ్కో తెలంగాణ కేవలం స్థిరాస్తి రంగానికి మాత్రమే పరిమితం కాలేదని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలోనూ భాగస్వామ్యం అవుతున్నామని చెప్పారు. రెరా సర్టిఫికెట్‌ పొందిన ప్రాజెక్ట్‌లు,లావాదేవీలలో పారదర్శకత ఉండే ప్రాజెక్ట్‌లనుమాత్రమే ప్రాపర్టీలో ఉన్నాయని, కొనుగోలుదారులు ధైర్యంగా నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. (రూ. 2.18 లక్షల కోట్లు: విదేశీ ఇన్వెస్టర్లు తెగ కొనేస్తున్నారు)

నేడు, రేపు కూడా.. 
మూడు రోజుల ఈ ప్రాపర్టీ షో శని, ఆదివారం కూడా ఉంటుంది. ప్రవేశం ఉచితం. ఈ ప్రదర్శనలో వందకు పైగా డెవలపర్లు, ఆరి్ధక సంస్థలు ఈ ప్రదర్శనలో తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సుమారు నగరంలో నలుమూలలో నిర్మాణంలో ఉన్న, పూర్తయిన 300లకు పైగా  ప్రాజెక్ట్‌లు ప్రదర్శనలో ఉన్నాయి. ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, విల్లాలు, ఫామ్‌ ల్యాండ్స్‌ ఇలా అన్ని రకాల ప్రాపరీ్టలు అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్‌ హోమ్‌ లోన్స్‌ వంటి బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు కూడా ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేశాయి.    

మరిన్ని వార్తలు