నేడు మార్కెట్లోకి రెడ్‌ మీ 9ఏ, రెడ్‌ మీ 9సీ

30 Jun, 2020 10:56 IST|Sakshi

చైనా దిగ్గజ కంపెనీ షియోమీ కంపెనీ నుంచి నేడు(జూన్‌ 30న) మార్కెట్లోకి రెడ్‌మీ 9ఏ, రెడ్‌మీ 9సీ మోడల్‌ స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. షియోమీ కంపెనీ మలేషియన్‌ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనలో మోడళ్ల ప్రత్యేకతలు(స్పెసిఫికేషన్ల) గురించి ఎలాంటి ప్రస్థావన చేయలేదు. ఈ లాంచింగ్‌కు సంబంధించిన ఈవెంట్ జరగనుందా? లేక నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తాయో కూడా షియోమీ తెలపలేదు. అయితే ఈ 2మోడళ్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న కొన్ని లీకులు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.  

రెడ్‌మీ 9ఏ స్పెసిఫికేషన్లు
కంపెనీ విడుదల చేసిన అధికారిక ఫేస్‌బుక్‌ పోస్ట్‌లోని రెడ్‌మీ 9ఎ ఫోటోను పరిశీలిస్తే.., వెనకవైపు ప్యానెల్, కెమెరా ప్లేస్ మెంట్‌ స్థానాలను మార్చినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ లీకులను ప్రకారం... గతేడాది కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసిన రెడ్‌మీ 8ఏ సీరీస్‌కు తదుపరి మోడల్ కావచ్చు. మీడ్‌నైట్‌ గ్రే, ట్విలైన్‌ బ్లూ, పీకాక్‌ గ్రీన్‌ రంగుల్లో లభ్యమవచ్చు. వెనుక భాగం కెమెరా సామర్థ్యం 13మెగా ఫిక్చెల్‌గానూ, ముందు భాగపు సెల్ఫీ కెమెరా సామర్థ్యం 5మెగా పిక్చల్‌గా ఉండొచ్చు. వెనకవైపు నాలుగు కెమెరాలను ఇందులో అందించనున్నారని లీకులు వస్తున్నాయి. అలాగే ఫోన్‌ ముందు వైపు ఉన్న నాచ్‌లో సెల్పీ కెమెరాను అమర్చినట్లు తెలిస్తోంది.  

ఈ రెడ్ మీ 9ఏ స్మార్ట్ ఫోన్లో 6.53 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్ ప్లేను అందించనున్నారు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ ను అందించే అవకాశం ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉండనుంది. 10W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది.  ఈ ఫోన్ లో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ అందించనున్నారు.

రెడ్‌మీ 9సీ స్పెసిఫికేషన్లు
రెడ్ మీ 9 సిరీస్ లో కొత్తగా లాంచ్ అవుతున్న మోడల్‌ ఇది. ప్రాసెసర్‌(మీడియాటెక్ హీలియో జీ25), డిస్‌ప్లే(6.53 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ డిస్ ప్లే), బ్యాటరీ(5000 ఎంఏహెచ్‌)లు రెడ్‌ మీ9 స్పెసిఫికేషన్లతో యథాతథంగా ఉండొచ్చు. అయితే ఈ మోడల్‌లో 3జీబీ ర్యామ్ +64 జీబీ స్టోరేజ్ ఉండొచ్చు. ముందు భాగం కెమెరా 13మెగా పిక్చెల్‌గా, వెనక భాగపు కెమెరా 2మెగా పిక్చెల్‌ ఉండొచ్చు. వెనకవైపు 3 కెమెరాలను ఇందులో అందించనున్నారని లీకులు వస్తున్నాయి..ఇక రెండింటిలో ఫిగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఉండొచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా