దిగొచ్చిన చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి: సంచలన నిర్ణయం

15 Sep, 2023 14:54 IST|Sakshi

రూ. 400 కోట్ల రూపాయలతొ ఢిల్లీలో స్మార్ట్‌ఫోన్‌  ప్లాంట్‌ 

డిక్సన్‌ టెక్నాలజీస్‌తో షావోమీ డీల్‌

Xiaomi smartphone plant: చైనా స్మార్టఫోన్‌ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు  షావోమి  సప్లయిర్‌ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించనుంది.  దీంతో  ఐఫోన్‌ తయారీ దారు తైవాన్‌ కంపెనీ ఫాక్స్‌కాన్‌కు పోటీగా డిక్సన్‌కు షావోమి పార్టనర్‌ షిప్‌ మరింత బలాన్నివ్వనుందని అంచనా. అయితే ఈ వార్తలపై అటు షావోమిగానీ, డిక్సన్‌గానీ అధికారికంగా  ప్రకటన విడుదల చేయలేదు. (ఎమర్జెన్సీ అలర్ట్‌ సివియర్‌..ఈ ఫ్లాష్‌ మెసేజ్‌మీకూ వచ్చిందా?)

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం 300,000 చదరపు అడుగులకు మించి, దాదాపు ఆరు ఫుట్‌బాల్ మైదానాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యాక్టరీలో డిక్సన్ మూడు సంవత్సరాలలో రూ. 400 కోట్ల రూపాయలు (48.2 మిలియన్‌ డాలర్లు) కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనుంది. ప్రధానంగా ఇక్కడ షావోమి  స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంట్‌ను ఈ నెలాఖరులో ప్రభుత్వ అధికారి ప్రారంభించనున్నారు. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్‌ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్‌ ఎక్కడ?)

అలాగే షావోమీ గతంలో చైనానుంచి దిగుమతి చేసుకున్న బ్లూటూత్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లను తయారు చేయడానికి  దేశీయ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌ కంపెనీకి కాంట్రాక్ట్‌ను కుదుర్చుకుంది. ఇది గతంలో చైనా నుండి దిగుమతి అయ్యేవి. డిక్సన్ వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ. మోటరోలా, శాంసంగ్ వంటి బ్రాండ్‌ల స్మార్ట్‌ ఫోన్‌లు, వాషింగ్ మెషీన్‌లు, టెలివిజన్ సెట్‌లతో సహా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది. మూడు దశాబ్దాల క్రితం డిల్లీ శివార్లలో సునీల్ వచాని డిక్సన్‌ను ప్రారంభించారు. 

కాగా ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒకపుడు టాప్‌లో ఎదురు లేకుండా ఉన్న షావోమి కేంద్ర నిబంధనలు, నియంత్రణలతో అధిక నియంత్రణ త తర్వాట్‌ మార్కెట్‌ షేర్‌ను కోల్పోయింది. దీన్నుంచు  కోలుకునే చర్యల్లో భాగంగా  మేడిన్‌ ఇండియా 5G స్మార్ట్‌ఫోన్‌లను సరసమైన ధరలో అందించాలని ప్లాన్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు