మార్కెట్లోకి ‘రెడ్‌మి నోట్‌ 8’

17 Oct, 2019 05:32 IST|Sakshi

ధరల శ్రేణి రూ. 9,999–17,999

ఇన్‌ బిల్ట్‌ అమెజాన్‌ అలెక్సాతో విడుదల  

సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘రెడ్‌మి నోట్‌ 8, 8 ప్రో’ పేరిట రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో విడుదలచేసింది. ఇన్‌ బిల్ట్‌ అమెజాన్‌ అలెక్సాతో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్లు.. గూగుల్‌ అసిస్టెన్స్, అలెక్సాతో పనిచేస్తుందని కంపెనీ వివరించింది. ఒకేసారి రెండు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన తొలి మొబైల్స్‌ ఇవే కాగా, వీటిలో రెడ్‌మి నోట్‌ 8 మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

6.39 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ మోడల్‌లో 6జీబీ/64జీబీ ధర రూ. 9,999..  6జీబీ/128జీబీ ధర రూ.12,999గా నిర్ణయించింది. మరో మోడల్‌ 8 ప్రో మూడు వేరియంట్లలో విడుదలైంది. 6.53 అంగుళాల డిస్‌ప్లే కలిగిన ఈ మోడల్‌ ధరల శ్రేణి రూ. 14,999 నుంచి రూ. 17,999గా ఉన్నాయి. ప్రపంచంలోనే తొలిసారిగా 64 మెగాపిక్సెల్‌ కెమెరా సెన్సార్, హెలియో జీ90టీ చిప్‌సెట్‌తో విడుదలైన అధునాతన స్మార్ట్‌ఫోన్లు ఇవేనని సంస్థ ఇండియా హెడ్‌ మనుకుమార్‌ జైన్‌ అన్నారు. అక్టోబరు 21 నుంచి కొత్త మోడళ్లు వినియోగదారులకు లభ్యంకానున్నాయని వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు