అదానీ చేతికి రిలయన్స్‌ ఇన్‌ఫ్రా విద్యుత్‌ ఆస్తులు

2 Nov, 2017 00:22 IST|Sakshi

డీల్‌ విలువ రూ.1,000 కోట్లు

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ట్రాన్స్‌మిషన్‌ కంపెనీ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు చెందిన ట్రాన్సిమిషన్‌ ఆస్తుల కొనుగోలు ప్రక్రియను పూర్తి చేసింది. రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన వెస్టర్న్‌ రీజియన్‌ స్ట్రెగ్తనింగ్‌ సిస్టమ్‌  స్కీమ్స్‌(డబ్ల్యూఆర్‌ఎస్‌ఎస్‌)కు చెందిన ట్రాన్స్‌మిషన్‌ ఆస్తులను రూ.1,000 కోట్లకు కొనుగోలు చేశామని అదానీ ట్రాన్సిమిషన్‌ లిమిటెడ్‌(ఏటీఎల్‌) తెలిపింది. ఈ ట్రాన్సిమిషన్‌ ఆస్తుల కొనుగోలుతో తమ పవర్‌ వీలింగ్‌ నెట్‌వర్క్‌ 8,500 సర్క్యూట్‌ కిలోమీటర్లను దాటేసిందని వివరించింది. కాగా రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు చెందిన ముంబై విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణి వ్యాపారాన్ని కొనుగోలు ప్రతిపాదిత ఒప్పందాన్ని అదానీ ట్రాన్స్‌మిషన్‌ ఇటీలనే కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం కాలవ్యవధి వచ్చే ఏడాది జనవరి 15 వరకూ ఉంటుంది. కాగా డబ్ల్యూఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌  ట్రాన్స్‌మిషన్‌ వ్యాపార విక్రయం పూర్తయిందని రిలయన్స్‌ ఇన్‌ఫ్రా పేర్కొంది. ఈ డీల్‌ విలువ సుమారుగా రూ.1,000 కోట్లు ఉంటుందని, ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి ఉపయోగిస్తామని వివరించింది. ఈ లావాదేవీ నేపథ్యంలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా, అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు రెండూ నష్టాల్లోనే ముగిశాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్‌ 1.2 శాతం నష్టంతో రూ.205 వద్ద ముగియగా, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా షేర్‌ 0.7 శతం నష్టపోయి రూ.498 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు