జియోకాయిన్‌ యాప్‌పై కంపెనీ క్లారిటీ

1 Feb, 2018 11:05 IST|Sakshi
జియోకాయిన్‌ యాప్‌ లాంచింగ్‌పై క్లారిటీ

రిలయన్స్‌జియో త్వరలోనే తన సొంత క్రిప్టోకరెన్సీ జియోకాయిన్‌ను లాంచ్‌ చేయబోతుందని... దాని కోసం స్పెషల్‌గా ఓ యాప్‌ను కూడా తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే తామెలాంటి యాప్‌ను లాంచ్‌ చేయడం లేదని, మార్కెట్‌లో వస్తున్న రూమర్లను రిలయన్స్‌ జియో బుధవారం ఖండించింది. కంపెనీ లేదా తమకు సంబంధించిన అసోసియేట్స్‌ ఎలాంటి యాప్స్‌ను ఆఫర్‌ చేయడం లేదని ప్రజలకు, మీడియాకు తాము తెలియజేస్తున్నామని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. జియోకాయిన్‌ పేరుతో వస్తున్న అన్ని యాప్స్‌కు కూడా నకిలీవే అని పేర్కొంది.

''జియో కాయిన్‌'' పేరుతో రిలయన్స్‌ డిజిటల్‌ గూగుల్‌ స్టోర్‌లో ఒక అప్లికేషన్‌ను ఉంచిందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. జియో పేరుతో యోగ్యత లేని కొంతమంది వ్యక్తులు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఈ విషయాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. గత కొన్నేళ్లుగా మార్కెట్‌లో డిజిటల్‌ కరెన్సీకి విపరీతంగా డిమాండ్‌ పెరిగిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. వీటిలో బిట్‌కాయిన్‌ ఎక్కువగా పాపులర్‌ అయింది. అయితే ఈ కరెన్సీలకు ఎటువంటి రెగ్యులేటరీలు లేవు. దీంతో వర్చ్యువల్‌ కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం తెలిపింది.
 

మరిన్ని వార్తలు