75స్థాయికి రూపాయి దిగజారుతుందా?

6 Dec, 2018 13:46 IST|Sakshi

2019 చివరికి  రూపాయి 75 స్థాయికి పడిపోయే అవకాశం - ఫిచ్‌ 

కరెంట్‌ ఖాతాలోటు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు

సాక్షి,ముంబై: అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు చమురు ధరల దెబ్బతో డాలరు మారకంలో పాతాళానికి పడిపోయిన దేశీయ కరెన్సీ  రూపాయి విలువ మరింత దిగజారనుందని అంచనాలు వెలువడ్డాయి.  ముఖ్యంగా దేశ కరెంటు ఖాతాలోటు ఆందోళనకరంగా విస్తరించిన నేపథ్యంలో రూపాయి విలువ మరింత క్షీణించ నుందని  ప్రముఖ రేటింగ్స్‌ సంస్థ ఫిచ్  అంచనా వేసింది.

ఇటీవల స్వల్పంగా పుంజుకున్నప్పటకీ రూపాయి 2018 గత ఏదేళ్లలో లేని దారుణ స్థాయికి పడిపోతుందని గురువారం  వ్యాఖ్యానించింది. అంతేకాదు వచ్చే ఏడాది(2019) చివరినాటికి డాలరు మారకంలో రూపాయి 75స్థాయికి పతనం కానుందని అంచనా  వేసింది. విస్తృత కరెంటు ఖాతా లోటు, కఠినమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇందుకు కారణంగా పేర్కొంది.

మరోవైపు 2019, మే నెలలో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రూపాయి క్షీణించనుందని రాయిటర్స్‌ పోల్స్‌ అంచనా వేసింది.  కాగా గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లోనే డాలర్‌ మారకంలో రూపాయి 71.04 వద్ద రెండు వారాల కనిష్ఠ స్థాయిని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు