శాంసంగ్‌ లాభం 58% డౌన్‌

3 Dec, 2019 05:16 IST|Sakshi

20 శాతం పెరిగిన ఆదాయం

వెయ్యి కోట్ల డాలర్లకు వృద్ధి  

న్యూఢిల్లీ: శాంసంగ్‌ ఇండియా కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 58 శాతం తగ్గింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.3,713 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,540 కోట్లకు తగ్గిందని కంపెనీల రిజిష్ట్రార్‌(ఆర్‌ఓసీ)కి శామ్‌సంగ్‌ ఇండియా వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం...,  

60 శాతం ఆదాయం మొబైల్‌ ఫోన్లదే...
ఈ కంపెనీ మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధి చెందింది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.61,066 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.73,086 కోట్లకు పెరిగింది. దీంతో భారత్‌లో 1,000 కోట్ల డాలర్ల ఆదాయ మైలురాయిని అధిగమించింది. కార్యకలాపాల ఆదాయం రూ.59,371 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ.70,628 కోట్లకు చేరింది. దీంట్లో 60 శాతం ఆదాయం (రూ.43,088 కోట్లు)మొబైల్‌ ఫోన్ల విభాగం నుంచే వచ్చింది. టీవీ, కెమెరాల విభాగం ఆదాయం రూ.5,016 కోట్లు, గృహోపకరణాల విభాగం ఆదాయం రూ.7,408 కోట్లుగా ఉన్నాయి. ఇక కంపెనీ మొత్తం వ్యయాలు రూ. 55,284 కోట్ల నుంచి 27% వృద్ధితో రూ.70,228 కోట్లకు పెరిగింది. వడ్డీ భారం రూ.711 కోట్ల నుంచి రూ.1,059 కోట్లకు ఎగసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క‌రోనా వ‌ల్ల లాభ‌ప‌డింది ఆ ఒక్కరే

శాంసంగ్‌ మాన్‌స్టర్‌ గెలాక్సీ ఎం21 లాంఛ్‌

కోవిడ్‌-19 : పన్ను చెల్లింపుదారులకు ఊరట

కరోనా కల్లోలం : రూపాయి పతనం

కరోనా భయాలు : మార్కెట్ల పతనం

సినిమా

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు

క‌రోనా వార్త‌ల‌పై నటి క్లారిటి