వచ్చే రెండేళ్లలో 25 కోట్లకు ’యోనో’ యూజర్లు!

9 Aug, 2018 00:59 IST|Sakshi

డిజిటల్‌ లక్ష్యాన్ని వెల్లడించిన ఎస్‌బీఐ

మోప్యాడ్‌ పేరుతో నూతన సేవలు  

ముంబై: డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఒకే యాప్‌ ద్వారా నిర్వహించుకునేలా ’యోనో’ (యూ ఓన్లీ నీడ్‌ వన్‌) పేమెంట్‌ యూప్‌ను అందుబాటులో ఉంచిన ఎస్‌బీఐ... ఈ యాప్‌ వినియోగాన్ని వేగంగా విస్తృత పరుస్తోంది. నగదు బదిలీ, డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం, డిజిటల్‌గానే బ్యాంక్‌ ఖాతా ప్రారంభం వంటివి ఇపుడు యోనో ప్రత్యేకతలుగా ఉన్నాయి. ప్రస్తుతం 25 లక్షల మంది యూజర్లు ఉన్న ఈ యాప్‌ వినియోగదారుల సంఖ్యను వచ్చే రెండేళ్లలో 25 కోట్లకు చేర్చడానికి లకి‡్ష్యంచామని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు.

యోనో ప్రస్తుతం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌గా ఉందని, దీన్ని త్వరలోనే బడ్డీతో అనుసంధానం చేస్తామని తెలియజేశారు. బుధవారమిక్కడ మోప్యాడ్‌ (మల్టీ ఆప్షన్‌ పేమెంట్‌ యాక్సెప్టెన్స్‌ డివైస్‌) పేరిట పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ టెర్మినల్‌ పరికరాన్ని ఆరంభించారు. కార్డులు, భారత్‌ క్యూఆర్, యూపీఐ, ఎస్‌బీఐ బడ్డీ (ఈ– వాలెట్‌) ద్వారా ఈ పీఓఎస్‌ వద్ద చెల్లింపులు చేయొచ్చు.
 

మరిన్ని వార్తలు