జగదేకసుందరిగా...

9 Aug, 2018 00:59 IST|Sakshi
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

అందాల తార శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించడానికి రంగం సిద్ధమైందని సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమా ‘యన్‌టీఆర్‌’. ఎన్టీఆర్‌ తనయుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ చేస్తూ, నిర్మిస్తున్నారు. విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సహ నిర్మాతలు. ఈ సినిమాలోనే జగదేక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటించనున్నారని సమాచారం. శ్రీదేవి, ఎన్టీఆర్‌ కలిసి దాదాపు 14 సినిమాలు చేశారు. శ్రీదేవి పాత్ర లేకుండా ఈ సినిమా అసంపూర్ణంగా ఉంటుందని ఆ పాత్రను కూడా కథలో జోడించారట. ఒక సాంగ్‌తో పాటు, కొన్ని కీలక సన్నివేశాలు శ్రీదేవి పాత్రకు సంబంధించి ఉంటాయని సమాచారం. ఇప్పటివరకూ జరిపిన చిత్రీకరణతో సినిమా 30 శాతం పూర్తయింది. కైకాల సత్యనారాయణ,  విద్యాబాలన్, రానా, మురళీ శర్మ తదితరులు నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ కానుంది.

మరిన్ని వార్తలు