శారిడాన్‌కు సుప్రీంకోర్టు ఊరట

17 Sep, 2018 14:20 IST|Sakshi
శారిడాన్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : డ్రగ్స్‌ నిషేధ జాబితా నుంచి శారిడాన్‌కు ఊరట లభించింది. కేంద్ర ప్రభుత్వం గత వారం నిషేధించిన 328 డ్రగ్స్‌ జాబితా నుంచి శారిడాన్‌, డార్ట్‌, పిరిటాన్‌ ఎక్స్‌పెక్టోరాంట్‌ మూడు బ్రాండ్లను మినహాయిస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. శారిడాన్‌, డార్ట్‌, పిరిటాన్‌ ఎక్స్‌పెక్టోరాంట్‌లను మార్కెట్‌లో విక్రయించుకునేలా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రజల ఆరోగ్యానికి హాని కరంగా ఉన్నాయంటూ దాదాపు 328 డ్రగ్స్‌పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  గతవారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌, పిరామల్‌ వంటి డ్రగ్స్‌ మేకర్స్‌కు భారీ ఊరట లభించింది. ఈ ప్రొడక్ట్‌లు, ఆయా కంపెనీలకు పాపులర్‌ బ్రాండ్లు. 328 మెడిషిన్లపై నిషేధం విధిస్తూ.. కేంద్రం జారీచేసిన నోటీసులపై ఈ కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జాబితా నుంచి తమ కాంబినేషన్స్‌ను మినహాయించాలని కంపెనీలు కోరాయి. 1988 నుంచి ఈ కాంబినేషన్స్‌ను తాము ఉత్పత్తి చేస్తున్నామని కంపెనీలు చెప్పాయి. అంతకముందు కూడా సుప్రీంకోర్టు, ప్రభుత్వ నిషేధం నుంచి ఇలాంటి 15 కాంబినేషన్లను మినహాయించినట్టు తెలిపాయి. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గ్లాక్సోస్మిత్‌క్లైన్ ధృవీకరించింది. పిరామల్‌ గ్రూప్‌ ఇంకా స్పందించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు