స్టాక్‌మార్కెట్‌పై వైరస్‌ ఎఫెక్ట్‌..

26 Feb, 2020 15:55 IST|Sakshi

ముంబై : కరోనా వైరస్‌ పలు దేశాలకు వ్యాప్తి చెందుతుండటం స్టాక్‌మార్కెట్లలో మదుపరులను ప్రభావితం చేసింది. వైరస్‌ భయాలతో స్టాక్‌మార్కెట్‌ బుధవారం వరుసగా నాలుగో రోజూ భారీగా నష్టపోయింది. రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, సన్‌ ఫార్మా షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

మొత్తంమీద 392 పాయింట్లు నష్టపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40 వేల పాయింట్ల దిగువన 39,888 పాయింట్ల వద్ద క్లోజయింది. 119 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,678 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ కీలక మద్దతు స్ధాయి 40,000 పాయింట్ల దిగువన పడిపోవడంతో మరికొద్ది రోజులు స్టాక్‌ మార్కెట్‌లో ఊగిసలాట ధోరణి కొనసాగుతుందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.

చదవండి : ఈ ఏడాదీ ‘షేర్ల’ పండుగే!

మరిన్ని వార్తలు