నష్టాలతో స్టాక్ మార్కెట్ ఆరంభం

10 Sep, 2015 09:56 IST|Sakshi

ముంబై: స్టాక్ మార్కెట్ గురువారం నష్టాలతో ప్రారంభమైంది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభం కాగానే సూచీలు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 300, నిఫ్టీ 100 పాయింట్లుపైగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు.  

రూపాయి పతనం కూడా కొనసాగుతోంది. ఆరంభ ట్రేడింగ్ లో డాలర్ తో రూపాయి మారకం విలువ 32 పైసలు పడిపోయి 66.73కి చేరుకుంది. బుధవారం 14 పైసలు బలపడిన రూపాయి విలువ 66.14 వద్ద ఆగింది.

>
మరిన్ని వార్తలు