అమ్మకాల సెగ : నష్టాల ముగింపు

16 Sep, 2019 15:45 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయస్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. ఆరంభంనుంచి బలహీనంగా ఉన్న సూచీలకు ముడిచమురు ధరలు మండటంతో దేశీయంగా అమ్మకాల సెగ  తగిలింది. ఇన్వెస్టర్లు అమ్మకాలతో  సెన్సెక్స్‌ ఒక దశలో 300 పాయింట్లకు పైగా నష్టపోయింది చివరికి  262 పాయింట్లు పతనమై 37,123వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు క్షీణించి 11003 వద్ద ముగిసింది. సౌదీ అరామ్‌కో చమురు క్షేత్రాలపై డ్రోన్‌ దాడుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంటు బాగా ప్రభావితమైంది. 

ప్రధానంగా బ్యాంక్స్‌, ఆటో. మెటల్‌, రియల్టీ భారీగా నష్టపోయాయి. మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా స‍్వల్ప లాభాలతో ముగిసాయి. బీపీసీఎల్‌, ఐవోసీ, యూపీఎల్‌తోపాటు ఎంఅండ్‌ఎం,  ఎస్‌బీఐ, యస్‌బ్యాంకు, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్, టాటా స్టీల్ నష్టపోగా, టైటన్‌, గెయిల్‌, టెక్‌ మహీంద్రా, హెచ్‌యూఎల్‌, సన్‌ ఫార్మా, ఐబీ హౌసింగ్‌  లాభపడ్డాయి. 

మరిన్ని వార్తలు