ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు

2 Nov, 2017 09:28 IST|Sakshi

ముంబై : బుల్‌ జోరుతో బుధవారం భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు, గురువారం ట్రేడింగ్‌లో స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 20.74 పాయింట్ల లాభంలో 33,621 వద్ద, నిఫ్టీ ఫ్లాట్‌గా 2.50 పాయింట్ల లాభంలో 10,443 వద్ద ట్రేడవుతున్నాయి. నేటి ట్రేడింగ్‌లో ఫార్మా స్టాక్స్‌ ఎక్కువగా లాభపడుతున్నాయి.

ప్రారంభ ట్రేడింగ్‌లో అరబిందో ఫార్మా, లుపిన్‌, సన్‌ ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, బజాజ్‌ ఆటో, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, యస్‌ బ్యాంకు లాభపడగా... యాక్సిస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌యూఎల్‌, హిందాల్కో నష్టపోయాయి. ఫలితాల ప్రకటన తర్వాత టెక్‌ మహింద్రా 2 శాతం పడిపోయింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 25 పైసల లాభంలో 64.50గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు రూ.61 లాభంలో రూ.29,214 వద్ద కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు