రెండో రోజూ నష్టాలే : 356 పాయింట్ల భారీ పతనం

2 Aug, 2018 15:56 IST|Sakshi

సాక్షి, ముంబై:  వరుస రికార్డుల తరువాత స్టాక్‌మార్కెట్లు  రెండోరోజు  నష్టాలను నమోదు చేశాయి.  ఆరంభ నష్టాలనుంచి ఏమాత్రం పుంజుకున్న ధోరణి కనిపించలేదు.  ట్రేడర్ల అమ్మకాలతో కీలక సూచీలు  మిడ్‌  సెషన్‌ తరువాత మరింత డీలా పడ్డాయి. దీంతో సెన్సె‍క్స్‌ 356 పాయింట్లు  కోల్పోయి 37,165 వద్ద, నిఫ్టీ 101 పాయింట్లు క్షీణించి 11,245 వద్ద , 11250  స్థాయికి దిగువన ముగిసింది. ఫార్మ తప్ప, బ్యాంకింగ్‌, ఆటో,  మెటల్‌, ఐటీ నష్టపోయాయి. చైనాతో ట్రేడ్‌ వార్‌కు అమెరికా  మళ్లీ కాలుదువ్వడంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు  నెగిటివ్‌గా ఉన్నాయి.   ఆర్‌బీఐ రెపో రేటుకోతు అంతర్జాతీయ ప్రతికూలత దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది.

కొటక్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, గ్రాసిమ్‌, మారుతీ, ఎంఅండ్‌ఎం, ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, వేదాంతా, టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్ర నష్టపోగా, లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, సన్‌ ఫార్మా, ఇండస్‌ఇండ్, గెయిల్‌, హెచ్‌యూఎల్‌, కోల్‌ ఇండియా లాభపడ్డాయి.
 

మరిన్ని వార్తలు