లాభాల స్వీకరణ, మార్కెట్లు డీలా

30 Dec, 2019 13:53 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనపడ్డాయి. రికార్డుస్థాయిల వద్ద  ట్రేడర్ల లాభాల స్వీకరణతో  స్టాక్‌మార్కెట్లు  ఇంట్రా డే నుంచి  250 పాయింట్లకు పైగా కుప్పకూలింది. ప్రస్తుతం కోలుకుంది. అమ్మ​​కాలతో ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న సెన్సెక్స్‌ 64 పాయింట్లు క్షీణించి 41511 వద్ద, నిప్టీ 14 పాయింట్ల నష్టంతో 12231 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల్లోనూ అమ్మకాలు కనిపిస్తున్నాయి. ఎయిర్‌టెల్‌ మినిమం  ప్రీపెయిడ్‌ చార్జింగ్‌ ప్లాన్‌ రేటును దాదాపు రెట్టింపు చేయడతో టెలికాం షేర్లు లాభపడుతున్నాయి. అలాగే ప్రభుత్వ రంగ  బ్యాంకులు షేర్లు నష్టాలతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో రికార్డు స్థాయిని నమోదు చేసిన బ్యాంకునిఫ్టీ కూడా నీరసపడింది.  టాటా మోటార్స్‌, సన్‌ఫార్మ, భారతి ఎయిర్‌టెల్‌, ఇండస్‌ ఇండ్‌  బ్యాంకు, ఐషర్‌ మోటార్స​  లాభ పడుతుండగా, హిందాల్కో, యస్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ నష్టపోతున్నాయి. 
 

మరిన్ని వార్తలు