జోరుగా సెన్సెక్స్‌ : ఆటో దూకుడు

1 Jul, 2019 14:59 IST|Sakshi

సాక్షి, ముంబై : అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు, దేశీయంగా సానుకూల అంచనాలతో  స్టాక్‌మార్కెట్లు దూకుడుమీద ఉన్నాయి.  అమెరికా - చైనా ట్రేడ్‌వార్‌  చర్చలకు తోడు,  జూన్‌ మాసం  వాహనాల విక్రయాలు బావుండటంతో సెన్సెక్స్‌  ట్రిపుల్‌ సెంచరీ లాభాల జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లకు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌  39,705 వరకూ ఎగసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌301 పాయింట్లు జంప్‌చేసి 39,695 వద్ద, నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 11,865 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

రియల్టీ, ఆటో, బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా  లాభపడుతుండగా, మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌  స్వల్పంగా నష్టపోతున్నాయి.డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా మోటార్స్‌, ఐబీ హౌసింగ్‌, బజాజ్‌ ఆటో, ఐషర్, జీ, హెచ్‌డీఎఫ్‌సీ, హీరో మోటో, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ టాప్‌ విన్నర్స్‌గా కొనసాగుతుండగా,  ఓఎన్‌జీసీ, ఐవోసీ, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫ్రాటెల్‌, టైటన్‌, అల్ట్రాటెక్‌, గెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  మరోవైపు  మరో నాలుగు  రోజుల్లో కేంద్ర బడ్జెట్‌ రానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆ వైపుగా దృష్టి  సారించినట్టుగా  ఎనలిస్టులు  చెబుతున్నారు.

మరిన్ని వార్తలు