దలాల్‌ స్ట్రీట్‌లో లాభాల జోరు

31 Jan, 2019 14:37 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు దూకుడు మీద కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో ఆరంభంలో200 పాయింట్లు  ఎగిసింది.  మరింత జోరందుకున్న సెన్సెక్స్ ఒక దశలో దాదాపు 600 పాయింట్లు జంప్‌చేసింది. ప్రస్తుతం 537 పాయింట్లు ఎగిసి 36128 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సైతం 147పాయింట్లు పురోగమించి 10,8799 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సెన్సెక్స్‌ 36వేలు, నిఫ్టీ 10800 స్థాయిని అధిగమించాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయంగానూ సెంటిమెంటు బలపడినట్టు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

ఒక్క మీడియా తప్ప అన్ని రంగాలూ లాభాల జోరును ప్రదర్శిస్తున్నాయి. ప్రధానంగా ఐటీ, బ్యాంక్స్‌, మెటల్‌, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా 1.5-1 శాతం మధ్య ఎగశాయి.  ఇన్ఫోసిస్‌, గెయిల్‌, యాక్సిస్‌, కొటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, ఆర్‌ఐఎల్‌, ఇండస్‌ఇండ్, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. మరోవైపు  బజాజ్‌ ఫిన్‌, యస్‌ బ్యాంక్‌, జీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐబీ హౌసింగ్‌, అదానీ పోర్ట్స్‌, హీరో మోటో, గ్రాసిమ్‌ 2.5-0.6 శాతం మధ్య క్షీణించాయి. 
 

మరిన్ని వార్తలు