లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు 

16 Feb, 2018 10:00 IST|Sakshi

ముంబై : ప్రపంచ మార్కెట్ల బాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు కొనసాగుతున్నాయి. గ్లోబల్‌గా సంకేతాలు పాజిటివ్‌గా వస్తుండటంతో, దేశీయ స్టాక్‌ మార్కెట్లు కూడా జోరుగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ప్రారంభమైన కొద్ది సెకన్లలోనే లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. ప్రస్తుతం 130 పాయింట్లు జంప్‌చేసి 34,427 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 43 పాయింట్లు లాభపడి 10,588 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్ఈలో దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. రియల్టీ, ఐటీ, మెటల్‌ 1 శాతం పైకి ఎగిశాయి.

మరోవైపు భారీ కుంభకోణ నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు షేర్లు మరో 2 శాతం కిందకి పడిపోయాయి. గత రెండు సెషన్ల నుంచి ఈ బ్యాంకు షేర్లు 21 శాతం మేర నష్టపోయాయి. కుంభకోణంలో ప్రధాన సూత్రదారుడు వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీకి చెందిన గీతాంజలి జెమ్స్‌ షేర్లు 19 శాతం ఢమాలమన్నాయి. నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ మిడ్‌క్యాప్‌లు రెండూ కూడా 150 చొప్పున లాభపడ్డాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసల లాభంలో 63.82 వద్ద కొనసాగుతోంది. 
 

మరిన్ని వార్తలు