నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

21 Jun, 2017 16:10 IST|Sakshi
ముంబై : ఆసియన్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, రిజర్వు బ్యాంకు పాలసీ మీటింగ్ మినిట్స్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు కూడా నష్టాల్లోనే ముగిశాయి. 13.89 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ 31,283 వద్ద, 19.90 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ 9,633 వద్ద క్లోజయ్యాయి.  టాటా మోటార్స్, ఓఎన్జీసీ 2 శాతం నష్టపోగా, విప్రో 1 శాతం పైకి  ఎగిసింది. గ్లోబల్ గా ఆయిల్ ధరలు ఏడు నెలల కనిష్టానికి పడిపోవడంతో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆయిల్ ఇండియా స్టాక్స్ నష్టాలు పాలయ్యాయి. ఇదే సమయంలో ఇంధన ధరలు తగ్గడంతో విమానయాన సంస్థల షేర్లు లాభాలు పండించాయి.
 
స్పైస్ జెట్ లిమిటెడ్, జెట్ ఎయిర్ వేస్, ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, ఇండిగో ఎయిర్ సంస్థలు లాభాల్లో నడించాయి. ఆర్బీఐ వచ్చే పాలసీ మీటింగ్ మినిట్స్ పై ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆకస్తి కనబరుస్తూ వేచిచూస్తున్నారు.. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 64.57గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 71 రూపాయల లాభంలో 28,597గా నమోదయ్యాయి. 
 
మరిన్ని వార్తలు