నష్టాల ముగింపు : ఫార్మా అప్‌

29 Jan, 2019 16:20 IST|Sakshi

సాక్షి,ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఆదినుంచి ఊగిసలాటాల మధ్యకొనసాగాయి. ఫ్లాట్‌గా మొదలైన కీలకసూచీలు, అనంతరం నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో 200 పాయింట్లకు పైగా జారుకు న్నాయి. అయితే చివరి అర్థగంటలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి.  చివరికి సెన్సెక్స్‌ నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలకు దిగువనే ముగిశాయి. సెన్సెక్స్‌ 64  పాయింట్లు నష్టపోయి 35,592 వద్ద, నిఫ్టీ  9పాయింట్లకు క్షీణించి 10652 వద్ద ముగిశాయి. దీంతో వరుసగా మూడో  రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. 

ముఖ‍్యంగా అదానీ గ్రూపు ష్రేర్లు, ఫార్మ సెక్టార్లు లాభాలు బాగా పుంజుకున్నాయి. ఇటు బడ్జెట్‌పై అంచనాలకు తోడు ,అమెరికా  చైనా ట్రేడ్‌వార్‌  ఇన్వెస్టర్లలో భయాందోళనలకు దారి తీసినట్టు భావించారు. రిలయన్స్‌, జేపీసీఎల్‌, ఐవోసీఎల్‌,  ఐషర్‌మోటార్స్‌, ఎల్‌ అండ్‌ టీ,  హిందుస్తాన్‌ పెట్రోలియం, పవర్‌ గ్రిడ్‌ నష్టపోగా, అబాన్‌ఆఫ్‌ షోర్‌, ఎగార్‌ లాజిస్టిక్‌ టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి.

మరిన్ని వార్తలు