-

రెండో రోజూ నష్టాలే

24 Dec, 2019 17:50 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. కీలక  సూచీలు రెండూ రికార్డు లాభాలను గడించిన అనంతరం వరుసగా రెండో రోజు కూడా బలహీనంగా ముగిసాయి.  సెన్సెక్స్‌ 181 పాయింట్లు క్షీణించి 41,461 వద్ద,  నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 12215 వద్ద స్థిరపడింది.   ప్రధానంగా ఐటీ, ఆటో, మీడియా రంగాలు నష్టపోగా మెటల్‌, రియల్టీ  లాభపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌, ఐషర్‌, యూపీఎల్‌, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, డాక్టర్‌ రెడ్డీస్‌, టీసీఎస్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. మరోవైపు యస్‌ బ్యాంక్‌, సిప్లా, ఇండస్‌ఇండ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ, హీరోమోటో, జీ, కోల్‌ ఇండియా, కొటక్‌ బ్యాంక్‌  టాప్‌ గెయినర్స్‌గా స్థిరపడ్డాయి.

కాగా క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా రేపు  (బుధవారం) మార్కెట్లకు సెలవు.  గురువారం తిరిగి యథావిధిగా పనిచేస్తాయి. 

మరిన్ని వార్తలు