భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ 

21 Jul, 2020 14:32 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయస్టాక్‌ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. వరుసగా ఐదోరోజు కూడా లాభాల బాటలో ఉన్నాయి. ప్రధానంగా  కరోనా వ్యాక్సిన్‌ పై ఆశలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ మరింత బలపడింది. దీంతో సెన్సెక్స్‌ 500 పాయింట్లకుపై ఎగియగా, నిఫ్టీ కూడా మద్దతు స్థాయికి ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటి షేర్ల  లాభాలు మార్కెట్‌కు ఊతమిస్తున్నాయి.  ప్రస్తుతం  సెన్సెక్స్ 550 పాయింట్లు  పెరిగి 37,969 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 151పాయింట్ల లాభంతో  11,173 వద్ద కొన సాగుతోంది. 

ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకి, టాటా మోటార్స్, విప్రో  2.64 శాతం, 3.52 శాతం ఎగిసింది. మరోవైపు, జీ ఎంటర్‌టైన్‌మెంట్, భారతి ఇన్ఫ్రాటెల్ నష్టపోతున్నాయి. 10 శాతం ఉద్యోగాల కోత ప్రకటనతో దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ఆరంభంలో నష్టపోయినా తరువాత కొద్దిగా పుంజుకుంది. ఏప్రిల్-జూన్ కాలానికి బజాజ్ ఫైనాన్స్ లాభాలు 19శాతం క్షీణించాయి. దీంతో షేరు 2 శాతం నష్టపోయింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి(ఏజీఆర్‌) బకాయిలపై సుప్రీంకోర్టు రిజర్వ్‌ ఆర్డర్స్‌ నేపథ్యంలో టెలికాం స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడికి లోనవుతోన్నాయి. వొడాఫోన్‌ ఐడియా 7 శాతానికిపైగా, భారతీ ఎయిర్‌టెల్‌  ఒక శాతం నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు