స్టాక్‌మార్కెట్లు : 2020 శుభారంభం

1 Jan, 2020 09:55 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. 2020 మొదటి సెషన్‌ను పాజిటివ్‌ నోట్‌తో శుభారాంభాన్నిచ్చాయి.  సెన్సెక్స్‌164 పాయింట్లకుపైగా ఎగిసింది. నిఫ్టీ 12200ని తాకింది. ప్రస్తుతతం సెన్సెక్స్‌ 92 పాయింట్ల లాభంతో 41346 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు ఎగిసి 12197వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లో ఉన్నాయి.  కొత్త ఏడాది జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ కూడా లాభాల్లోనే ప్రారంభమైన సంగతి విదితమే.

బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మ లాభాల్లో ఉండగా, ఆటో, ఐటీ, ఎనర్జీ సెక్లార్లు స్వల్పంగా నష‍్టపోతున్నాయి.  టైటన్‌, భారతి ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, హచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు టాప్‌ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. ఐషర్‌మోటార్స్‌,ఇండ్స్‌ ఇండ్‌, కోల్‌ ఇండియా, సిప్లా, ఎం అండ్‌ ఎం, నెస్లే బజాజ్‌ ఆటో, టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ స్వల్పంగా నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు