లాభాల జోరు, ట్రిపుల్‌ సెంచరీ

6 Sep, 2019 14:05 IST|Sakshi

సాక్షి, ముంబై:  ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడ్డ సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరుగా  ట్రేడ్‌ అవుతున్నాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో . ప్రస్తుతం సెన్సెక్స్‌  ఏకంగా 344 పాయింట్లు జంప్‌ చేసి 36,991 వద్ద,   37,000 పాయింట్ల మార్క్‌కు అతిసమీపంలోకి వచ్చింది. అలాగే  నిఫ్టీ 101పాయింట్లు ఎగసి 10,944 వద్ద ట్రేడవుతోంది.  ప్రయివేట్‌ రంగ పేరోల్స్‌లో వృద్ధి, వాణిజ్య వివాదాలకు అక్టోబర్‌లో చైనాతో అత్యున్నత సమావేశం తదితర సానుకూల అంశాల నేపథ్యంలో గురువారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు హైజంప్‌ చేశాయి.

ప్రధానంగా బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో, మీడియా పుంజుకెగా,  రియల్టీ  సెక్టార్‌నష్టపోతోంది.  టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌, ఎన్‌టీపీసీ, మారుతీ, ఆర్‌ఐఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటక్‌ బ్యాంక్‌, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐషర్  భారీగా లాభపడుతుండగా, ఐబీ హౌసింగ్‌, సన్‌ ఫార్మా, విప్రో, యస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌, గెయిల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు