అనూహ్యంగా నష్టాల్లోకి సూచీలు

25 Jan, 2019 14:50 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీ స్టాక్‌మార్కెట్లలో వరుసగా రెండోరోజు కూడా ఒడిదుడుకుల పర్వం కొనసాగుతోంది. సెన్సెక్స్‌ ప్రారంభంలో డబుల్‌ సెంచరీలాభాలతో ఉత్సాహంగా ఉన్నా అకస్మాత్తుగా నష్టాల్లోకి మళ్లింది. మిడ్‌ సెషన్‌ తరువాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో లాభాలన్నీ ఆవిరైపోయాయి  దీంతో సెన్సెక్స్‌ 18 పాయింట్లు  క్షీణించి 36,176  వద్ద,  నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 10,824 వద్ద ట్రేడవుతోంది. 

ముఖ్యంగా మీడియా సెక్టార్‌  13 శాతం   పతనం కావడంతో మార్కెట్లుకూడా అదే  బాట పట్టాయి.  రియల్టీ షేర్లుకూడా నష్టాల్లో ఉన్నాయి  ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, బ్యాకింగ్  రంగాలు స్వల్పంగా లాభపడుతున్నాయి. మీడియా కౌంటర్లలో డిష్‌ టీవీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 5ఏళ్ల కనిష్టానికిపడిపోయింది. జాగరణ్‌, యుఫో, ఈరోస్‌, పవీఆర్‌, టీవీటుడే  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. నిన్న సీఎండీ నియామకాన్ని ప్రకటించడంతో  యస్‌ బ్యాంక్‌ 6 శాతం పుంజుకుంది.  ఇంకా ఇన్‌ఫ్రాటెల్‌, ఎయిర్‌టెల్‌, యూపీఎల్‌,  హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, కొటక్‌ బ్యాంక్‌, ఐవోసీ, సన్ ఫార్మా లాభపడుతున్నాయి. అల్ట్రాటెక్, హీరో మోటో, గ్రాసిమ్‌, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఏషియన్‌ పెయింట్స్‌   అత్యధికంగా నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు