జోష్‌గా మార్కెట్లు : 500 పాయింట్లు జంప్‌

12 Dec, 2018 14:53 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. పలు ప్రతికూల అంశాలను అధిగమిస్తూ వరుసగా రెండో రోజు కొనుగోళ్లకు ఎగబడటంతో మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 567పాయింట్లు జంప్‌చేసి 35720 వద్ద, నిఫ్టీ సైతం 170 పాయింట్లు పెరిగి 10719 వద్ద కొనసాగుతున్నాయి.  ప్రధానంగా ఆటో, రియల్టీ, మెటల్‌ బ్యాంక్‌ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ లాభాలు మార్కెట్లను లీడ్‌ చేస్తున్నాయి.  అయితే ఒక్క ఫార్మా స్వల్పంగా నష్టపోతోంది.

ఇండియా బుల్స్‌ 10 శాతం దూసుకెళ్లగా.. గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, డీఎల్‌ఎఫ్‌, ప్రెస్టేజ్‌,  ఫినిక్స్‌, ఒబెరాయ్‌, సన్‌టెక్‌, శోభా, బ్రిగేడ్‌ 4-1 శాతం మధ్య ఎగశాయి. ఇక ఆటో స్టాక్స్‌లో మదర్‌సన్, హీరోమోటో, టాటా మోటార్స్‌, ఎక్సైడ్‌, బజాజ్‌ ఆటో, ఎంఅండ్‌ఎం, ఐషర్‌, అశోక్‌ లేలాండ్, టీవీఎస్‌ మోటార్, భారత్‌ ఫోర్జ్‌, మారుతీ, అమరరాజా, ఎంఆర్‌ఎఫ్‌ 5.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి.  రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు గవర్నర్‌గా శక్తికాంత్‌  నియామకాన్ని ప్రభుత్వం  ప్రకటించడంతో బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. దీంతో దిగ్గజాలలో యస్‌బ్యాంక్‌, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ  లాభపడుతున్నాయి. వీటితోపాటు ఐబీ హౌసింగ్‌, టాటా స్టీల్‌, ఎయిర్‌టెల్‌, అదానీ పోర్ట్స్‌, యూపీఎల్‌ 4-3 శాతం ఎగిశాయి. మరోపక్క డాక్టర్‌ రెడ్డీస్‌ 5.5 శాతం పతనంకాగా.. హెచ్‌పీసీఎల్‌, టైటన్‌, ఇన్‌ఫ్రాటెల్‌ మాత్రమే నామమాత్రపు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

అటు దేశీయ కరెన్సీ ఆరంభంతో పోలిస్తే  కొద్దిగా పుంజుకుని 11పైసల నష్టంతో 71.96 వద్ద ఉంది.
 

మరిన్ని వార్తలు