భారీగా నష్టపోతున్న స్టాక్ మార్కెట్లు

6 Jan, 2015 12:08 IST|Sakshi

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్‌ 466 పాయింట్లకు పైగా కోల్పోతోంది. ప్రస్తుతం 27,300లకు సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా పడుతూ 8,220కి సమీపంలో ట్రేడవుతోంది. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు తీవ్ర స్థాయిలో రావడంతో మన మార్కెట్లు నష్టపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు ఆశించిన స్థాయిలో ఉండదనే అంచనాలతో ఇన్వెస్టర్లు పెద్దయెత్తున అమ్మకాలు జరుపుతున్నారు.

అమెరికా నుంచి ఆసియా దాకా ఒక సూచీ కూడా లాభాల్లో లేదంటే ఇన్వెస్టర్ల అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. ముఖ్యంగా యూరోప్‌, జపాన్‌ ఆర్థిక వ్యవస్థలు ఎక్కువగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దేశాల్లోని సూచీలు భారీ నష్టాల్లో ఉన్నాయి. వృద్ధిరేటు బాగా మందగిస్తుందనే అంచనా వల్ల నైమెక్స్‌ క్రూడాయిల్‌ ధర 50 డాలర్లకు పతనమైంది. బ్రెంట్‌ క్రూడాయిల్ ధర 53 డాలర్లకు సమీపంలో ట్రేడవుతోంది. క్రూడ్‌ ధర తగ్గడం వల్ల పెట్రోల్‌, డీజిల్ ధరలు మరోసారి తగ్గే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు