సాక్షి మనీ మంత్ర: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌మార్కెట్లు

21 Nov, 2023 16:13 IST|Sakshi

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ప్రారంభం నుంచి ముగింపు వరకు లాభాల్లో కదలాడాయి. నిఫ్టీ 89 పాయింట్లు లాభపడి 19,783 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 275 పాయింట్లు పుంజుకుని 65,930 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 30 సూచీలో  జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టైటాన్‌, టాటాస్టీల్‌, సన్‌ఫార్మా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ లాభాల్లో ట్రేడయ్యాయి. 

ఎన్‌టీపీసీ, టెక్‌ మహీంద్రా, మారుతిసుజుకీ, ఎస్‌బీఐ, ఎల్‌ అండ్‌ టీ, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌ కంపెనీ షేర్లు నష్టపోయాయి. 

కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, ఆటో, బ్యాంకింగ్, రియాల్టీ స్టాక్‌లకు సంబంధించిన సూచీల్లో ర్యాలీ కనిపించింది. ప్రధానంగా స్టీల్‌ స్టాక్‌ల మంచి లాభాల్లో ముగిశాయి. ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ స్టాక్‌లు స్వల్ప నష్టాల్లో కదలాడాయి. మరోవైపు మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లలో మంచి ర్యాలీ కనిపించింది. బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్‌లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ట్రేడర్లు, ముదపరులు రేపు రాబోతున్న ఫెడ్‌ మినట్స్‌ మీటింగ్‌ సమావేశం సారంశం కోసం వేచిచూస్తున్నట్లు సమాచారం.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

మరిన్ని వార్తలు