వాటా కొనుగోలు : యస్‌ బ్యాంకుకు ఊరట 

5 Mar, 2020 12:19 IST|Sakshi

సాక్షి, ముంబై: సంక్షోభంలో పడిన ప్రైవేటు రంగ బ్యాంకు యస్‌ బ్యాంకుకు ఊరట లభించనుంది. యస్‌ బ్యాంకులో వాటాను కొనుగోలు చేసే కన్సార్షియంకు  ప్రభుత్వ రంగ బ్యాంకు  ఎస్‌బీఐ నాయకత్వం వహించనుందని బ్లూం బర్గ్‌ నివేదించింది. దీనికి భారత ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపిందని పేర్కొంది. దీంతో గురువారం నాటి మార్కెట్‌లో యస్‌ బ్యాంకు షేర్లు 29 శాతం ర్యాలీ అయ్యాయి. యస్ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేసేందుకు ఒక కన్సార్షియం ఏర్పాటుకు ఆమోదం లభించిందని కన్సార్షియంలో సభ్యులను ఎంపిక చేసేందుకు కూడా ఎస్‌బీఐ గ్రీన్ సిగ్నల్ లభించిందన్న వార్తలు మార్కెట్‌ వర్గాల్లో వ్యాపించాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది.

అయితే ఈ వార్తలపై అటు  యస్‌ బ్యాంకు కానీ, ఇటు ఎస్‌బీఐ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు. మరోవైపు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలను కనీసం ఒక నెల ఆలస్యంగా ప్రకటించనున్నామని యస్‌ బ్యాంకు ఫిబ్రవరిలో రెగ్యులేటరీకిచ్చిన సమాచారంలో తెలిపింది. కాగా బ్యాడ్‌ లోన్ల బెడదకు తోడు, బోర్డులో ఏర్పడ్డ విభేదాలతో యస్‌ బ్యాంకు ఇటీవల కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలోమూలధనాన్ని సమకూర్చుకోవడానికి చాలా కష్టపడుతోంది. దీంతో గత కొన్ని నెలలుగా ఈ స్టాక్‌గా భారీ పతనాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు