వరుసగా రెండో రోజు నష్టాలే

21 Jan, 2020 15:42 IST|Sakshi

 భారీగా నష‍్టపోయిన ఆటో, మెటల్‌ షేర్లు

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. వరుసగా రెండో రోజుకూడా బలహీనంగా మొదలైన స్టాక్‌మార్కెట్‌లో  ఈ రోజుకూడా  లాభాల స్వీకరణ కనిపించింది.ప్రధానంగా ఐఎంఎఫ్‌ భారత వృద్ధి రేటును మరోసారి తగ్గించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  దీనితో సెన్సెక్స్‌  205 పాయింట్లు నష్టపోయి 41323 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు క్షీణించి వద్ద 12169  ముగిసింది. తద్వారా నిఫ్టీ 12220 స్థాయిని కూడా కోల్పోయింది.  దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి. ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్‌ రంగ షేర్లు నష్టపోయాయి.  యాక్సిస్‌,  హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.

టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, ఐవోసీ, మారుతి సుజుకి, టాటా మోటార్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, పవర్‌ గ్రిడ్‌, వేదాంతా టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. భారతి ఇన్‌ఫ్రాటెల్‌, జీ, బీపీసీఎల్‌, కోటక్‌ మహీంద్ర, గ్రాసిం లాభపడిన వాటిల్లో టాప్‌లో ఉన్నాయి.   మరోవైపు టెలికాం రంగానికి  ఊరట లభించనుందనే  అంచనాలతో టెలికాం షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి. ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేష​ ఝన్‌ ఝన్‌వాలా స్వల్పంగా తన వాటాను విక్రయించిన వార్తలతో ఎస్కార్ట్స్‌ నష్టపోయింది. తాజా స్టేక్‌ సేల్‌తో  ఎస్కార్ట్స్‌లో ఆయనవాటా  8.16  శాతం నుంచి 7.73 శాతానికి  స్వల్పంగా తగ్గింది. 

>
మరిన్ని వార్తలు