అదే జోరు : సెన్సెక్స్‌ 1000 పాయింట్లు జంప్‌

23 Sep, 2019 09:08 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం కూడా హుషారుగా ప్రారంభమైనాయి. కార్పొరేట్‌ పన్ను కోత నేపథ్యంలో గత వారాంతంలో రికార్డుల లాభాలను నమోదు చేసిన కీలక సూచీలు ఈ రోజూ అదే జోరును కంటిన్యూ చేశాయి. సెన్సెక్స్‌1000 పాయింట్లు ఎగియగా, నిఫ్టీ 350  పాయింట్లకు పైగా లాభాలతో కొనసాగుతోంది. ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లతో సెన్సెక్స్‌ 39 వేలను  దాటేసింది.నిఫ్టీ 11550 మార్క్‌ను, నిఫ్టీ బ్యాంకు కూడా 30 వేల మార్క్‌ను  అధిగమించడం విశేషం. దాదాపు అన్ని రంగాల షేర్లలో  కొనుగోళ్ల ధోరణి కనిపిస్తోంది. బ్యాంకింగ్‌, ఆటో ఇన్‌ఫ్రా  సెక్టార్లు భారీగా లాభపడుతున్నాయి. అలాగే  హోటళ్లపై జీఎస్‌టీ తగ్గింపుతో  హోటల్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. మరోవైపు ఫార్మ, ఐటీ సెక్టార్లు నష్టపోతున్నాయి. ఎల్‌ అండ్‌ టీ, ఐటీసీ, ఇండస్‌ ఇండ్‌,  ఐసీఐసీఐ బ్యాంకు, ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌,  ఓఎన్‌జీసీ, మారుతి సుజుకి టాప్‌ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి.  డా.రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, భారతి ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్ర, పవర్‌ గ్రిడ్‌,వి ప్రో, టీసీఎస్‌ నష్టపోతున్నాయి.  అటు డాలరు మారకంలో రుపీ పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది. డాలరు పోలిస్తే  70.99 వద్ద కొనసాగుతోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా