ఫ్లాట్‌ ఆరంభం: ఊగిసలాట

24 Sep, 2019 09:47 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి వరుస రికార్డు లాభాలనుంచి స్వల్పంగా శాంతించిన మార్కెట్లు మంగళవారం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ, కొనుగోళ్లు మద్య కన్సాలిడేట్‌​ అవుతోంది.  ప్రస్తుతం సెన్సెక్స్‌ 120 పాయింట్లుఎగిసి 39210 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు  లాభంతో11628 వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుడుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి.  రిలయన్స్‌, టాటా మోటార్స్‌, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్‌,  ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, వేదాంతా, ఎం అండ్‌ ఎం, సన్‌ఫార్మ, కోల్‌ఇండియా, ఇండస్‌ ఇండ లాభపడుతున్నాయి.  మరోవైపు  ఐషర్‌ మోటార్స్‌,  జేఎస్‌డబ్ల్యు స్టీల్‌,  నెస్లే, ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐవోసీ టైటన్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌ నష్టపోతున్నాయి. 
 

మరిన్ని వార్తలు