లాభాల స్వీకరణ : 34 వేల దిగువకు సెన్సెక్స్

9 Jun, 2020 15:43 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిసాయి. ఆరంభంలోనే ఒడిదుడుకులను  ఎదుర్కొన్న సూచీలు మిడ్ సెషన్ నుంచి మరింత కుదేలయ్యాయి.  డే హై నుంచి  దాదాపు 900 పాయింట్లను కోల్పోయాయి. చివరకు సెన్సెక్స్ 414 పాయింట్ల నష్టంతో  33957 వద్ద, నిఫ్టీ 121 పాయింట్లు క్షీణించి 10046 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ  లాభాల స్వీకరణ కనిపించింది. ప్రదానంగా బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి.  దీంతో సెన్సెక్స్ 34 వేల స్థాయిని కోల్పోయింది. 

మరిన్ని వార్తలు