ఆరంభ లాభాలు ఆవిరి : ఫ్లాట్‌గా మార్కెట్లు

9 Oct, 2018 10:00 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లలో తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. 150పైగా పాయింట్ల లాభాలతో ప్రారంభమైనా వెంటనే లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.  అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి మళ్లాయి.  ముఖ్యంగా అంతర్జాతీయ అననుకూల వాతావరణ నేపథ్యంలో ప్రస్తుతం సెన్సెక్స్‌, నిఫ్టీ ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి. చైనా ఆర్థిక మందగమన ఆందోళనలతో అమెరికా ఇండెక్స్‌ నాస్‌డాక్‌ యూరోపియన్‌ మార్కెట్లు నష్టాలతో ముగియగా,  ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది.

మీడియా, ఫార్మా, మెటల్‌ రంగాలు లాభాల్లోనూ ఆటో  నష్టాల్లోనూకొనసాగుతోంది.  టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, ఐసీఐసీఐ, ఐవోసీ, ఐషర్‌, కొటక్‌ బ్యాంక్‌, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యూపీఎల్‌, ఆర్‌ఐఎల్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  మరోవైపు ఎస్‌బ్యాంకు, జీ ఎంటరటైన్‌మెంట్‌,అల్ట్రా టెక్‌ సిమెంట్‌, హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు