టాప్ ఎగ్జిక్యూటివ్స్ను తొలగించిన సన్ఫార్మా

18 Jun, 2015 13:48 IST|Sakshi
టాప్ ఎగ్జిక్యూటివ్స్ను తొలగించిన సన్ఫార్మా

ముంబై:  ఫార్మా దిగ్గజం సన్ఫార్మా.. 18మంది టాప్ ర్యాంక్ ఉద్యోగులపై వేటు వేసింది.  సీఈవో, ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న ఉద్యోగులను రాజీనామా చేయాల్సిందిగా కోరింది.   సీఈవోగా ఉన్న ఇంద్రజిత్  బెనర్జీ,  యూగుల్ సిగ్రితో పాటు, మరో 18 మందిని కంపెనీని వీడాల్సిందిగా ఆదేశాలు  జారీ చేసింది. అందుకుగాను వీరికి స్పెషల్ ప్యాకేజీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఉన్నత హోదాలో ఉన్న ఉద్యోగుల తొలగింపుపై  సన్ ఫార్మా వివరణ ఇచ్చుకుంది. 'వారిని కొనసాగించేందుకు,  వారి ప్రతిభా పాటవాలను  పూర్తిగా వినియోగించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాం,  కానీ విఫలమయ్యాం.  చాలా పారదర్శకంగా, సున్నితంగా ఈ వ్యవహారాన్ని డీల్ చేశామని' సన్ఫార్మా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

గత కొన్ని నెలలుగా నష్టాల్లో ఉన్న కంపెనీ గట్టెక్కించేందుకే సన్ఫార్మా ఈ కీలక  నిర్ణయం తీసుకున్నట్లు ఎనలిస్టులు అంచనా  వేస్తున్నారు.  రెండు పెద్ద కంపెనీల విలీనం తర్వాత మొదటి సారి కంపెనీ కష్టాలను ఎదుర్కొంటోందని వారు పేర్కొంటున్నారు. కాగా గతంలో ర్యాన్బ్యాక్సీతో జత కట్టి కష్టాల్లో పడ్డ జపాన్కు చెందిన  దైచీ శాంక్యో కంపెనినీ  2014 ఏప్రిల్లో సన్ ఫార్మా టేకోవర్ చేసింది.  అలాగే 2016 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభాలు  తగ్గుముఖం పట్టనున్నాయనే అంచనాల నేపథ్యంలో, కష్టాల నుంచి గట్టెక్కడం కోసం  కంపెనీ మల్లగుల్లాలు పడుతోంది.

మరిన్ని వార్తలు