కార్లపై భారీ ఆఫర్లు, రూ. 1.5 లక్షల డిస్కౌంట్‌

17 Sep, 2019 18:52 IST|Sakshi

టాటా మోటార్స్‌  భారీ ఆఫర్లు రూ.1.5 లక్షల దాకా తగ్గింపు

కారు ధరకు100 శాతం రుణ సదుపాయం  

సాక్షి, ముంబై:   దేశీ ప్రముఖ వాహన తయారీ  సంస్థ   టాటా మోటార్స్  వాహన ప్రియులకు  మంచి వార్త అందించింది.  అదిరిపోయే పండుగ ఆఫర్లు ప్రకటించింది. టాటా మోటార్స్‌ లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌  మోడల్‌  కారు హారియర్‌తో పాటు వివిధ కార్లపై భారీ తగ్గింపును ఆఫర్‌ చేస్తోంది. నెక్సన్, హెక్సా, టియాగో, టియాగో ఎన్ఆర్‌జీ, టిగోర్, హారియర్  కార్ల కొనుగోళ్లపై ఏకంగా రూ.1.5 లక్షల భారీ తగ్గింపు అందిస్తోంది.  కార్ల పండుగ పేరుతో నిర్వహిస్తున్న ప్రచారంలో  పాత, కొత్త వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ ప్రయోజనాలు అందివ్వనుంది.  ఎక్స్చేంజ్‌ ద్వారా తమ కార్లు కొనుగోలు చేసేవారికి కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

అంతేకాదు కస్టమర్లకు ఆర్థిక మద్దతు అందించేందుకు 100శాతం  ఆన్‌ రోడ్‌ ఫైనాన్స్‌, లోకాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్నికూడా ఆఫర్‌ చేస్తోంది. ఇందుకోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. టాటా మోటార్స్ ‘ఫెస్టివల్ ఆఫ్ కార్స్’ పథకంలో భాగంగా  ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్స్ కోసం ప్రత్యేకమైన  ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

టాటా మోటార్స్  వివిధ కార్లపై డిస్కౌంట్‌ ఆఫర్లు
టాటా హెక్సా మోడల్‌పై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు 
టాటా నెక్సన్ కారుపై రూ.85,000 వరకు డిస్కౌంట్ 
టాటా టియాగో మోడల్‌పై రూ.70,000  తగ్గింపు ఆఫర్‌
టాటా టియాగో ఎన్ఆర్‌జీ కారుపై రూ.70,000 వరకు డిస్కౌంట్ 
టాటా టిగోర్ మోడల్‌పై రూ.1.15 లక్షల వరకు  ప్రయోజనం పొందే అవకాశం 
హారియర్  కారుపై రూ.50 వేల వరకు  తగ్గింపు

ఓనం ,  గణేష్ చతుర్థి సందర‍్భంగా  కస్టమర్ల  నుంచి  అద్భుతమైన స్పందన లభించిందనీ టాటా మోటార్స్ సేల్స్, ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ బార్మాన్ తెలిపారు. దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో ఉత్సాహం నింపేందుకు, 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' ప్రచారం చేపట్టామని వెల్లడించారు.  ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో  భారీ ప్రోత్సాహం లభిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈసందర‍్భంగా   కస్టమర్లు,  భాగస్వాములందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు