యాపీ ఫిజ్‌ బంపర్‌ ఆఫర్‌..

12 Nov, 2019 12:28 IST|Sakshi

యాపీ ఫిజ్ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌

నలుగురు విజేతలకు శాంసంగ్‌ గెలాక్సీ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లు

ట్విటర్‌లో వివరాలను షేర్‌ జూనియర్‌ ఎన్‌టీఆర్‌ 

పార్లే ఆగ్రో కంపెనీ తమ పాపులర్ ప్రొడక్ట్ యాపీ ఫిజ్ తన వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్లను బహుమతిగా ఇస్తోంది. ప్రమోషన్‌లో బాగంగా నాలుగు శాంసంగ్‌ గెలాక్సీ 10 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లను గ్రాండ్‌ప్రైజ్‌గా అందివ్వనుంది.  నవంబరు 7 నుంచి  22 వరకు ఈ పోటీ అందుబాటులో ఉంటుంది. 
 
పోటీలో పాల్గొనాలంటే..

  • దేశ వ్యాప్తంగా ఆ పోటీ అందుబాటులో ఉంది. ఫీల్‌ ద ఫిజ్‌ అధికారిక ఇన్‌స్టగ్రామ్‌ను పేజీని ఫాలో కావాలి.
  • యాపీ ఫిజ్‌తో కలిపి మీకు నచ్చిన ఏ ఆహారాన్ని జతగా తీసుకుంటే బాగుంటుంది? అనే విషయాన్ని ఫోటోలు, వీడియోలతో సహా జతచేయాలి. 
  • పోటీలో పాల్గొనాల్సిందిగా మీ స్నేహితులను ఆహ్వానించాలి. తద్వారా మీరు, మీ స్నేహితులు బహుమతులు గెలుచుకోవచ్చు. 
  • ప్రతి వారం లక్కీ విజేతలు ఆర్టోఫ్ ఫిజ్ మర్చండైజ్ గెలుచుకోవడానికి అర్హులు.
  • అలాగే 4 మంది అదృష్ట విజేతలను ప్రకటిస్తుంది. వీరు శాంసంగ్‌ గెలాక్సీ నోట్ 10 ప్లస్‌ ఫోన్‌ను గెలుచుకోవచ్చు.

కాగా దక్షిణ భారతంలో యాపీ ఫిజ్‌ ప్రచారకర్తగా ప్రముఖ తెలుగు సినీ నటుడు నందమూరి తారక రామారావు (జూనియర్‌ ఎన్‌టీఆర్‌) వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్‌టీఆర్‌  ట్విటర్‌ ఖాతాలో ఈ కాంటెస్ట్‌ గురించి పోస్ట్‌ చేశారు. తన ప్రశ్నకు సమాధానాలు ఇచ్చి, బహుమతులు గెలుచుకోవచ్చని సూచించారు. దీంతో అటు యాపీ ఫిజ్‌ ఫ్యాన్స్‌, ఇటు యంగ్‌టైగర్‌ ఫ్యాన్స్‌ ట్విటర్‌లో ఇమేజ్‌లు, వీడియోలతో  సందడి చేస్తున్నారు. పోటీకి సంబంధించి మరిన్ని వివరాలకు '@iamappyfizz', '#ArtofFizz' హ్యాష్ ట్యాగ్ లను పరిశీలించాలి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా