ఈ ఏడాది 20 బిలియన్ డాలర్లు

23 Jun, 2014 00:29 IST|Sakshi
ఈ ఏడాది 20 బిలియన్ డాలర్లు

 దేశీ మార్కెట్లోకి విదేశీ పెట్టుబడుల వెల్లువ
 
ముంబై: ఈ ఏడాది జనవరి మొదలు ఇప్పటివరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) దేశీ క్యాపిటల్ మార్కెట్లో 20.5 బిలియన్ డాలర్లను(రూ. 1,23,000 కోట్లు) ఇన్వెస్ట్‌చేశారు. వీటిలో ఈక్విటీలకు 9.95 బిలియన్ డాలర్లను(రూ. 59,723 కోట్లు) కేటాయించగా, రుణ (డెట్) మార్కెట్లో 10.5 బిలియన్ డాలర్లను(రూ. 63,476 కోట్లు) పెట్టుబడిగా పెట్టారు. ఈ బాటలో ఈ నెలలో ఇప్పటివరకూ 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్‌చేయడం గమనార్హం.
 
కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం, కొత్త ప్రభుత్వం సంస్కరణలకు తెరలేపడం వంటి అం శాలు ఎఫ్‌ఐఐలకు ప్రోత్సాహాన్నిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌ఐఐలు ఓపక్క ఈక్విటీలలో నికరంగా 2.35 బిలి యన్ డాలర్లు(రూ. 13,918 కోట్లు) ఇన్వెస్ట్‌చేయగా, 2.93 బిలియన్ డాలర్ల(రూ. 17,357 కోట్లు) విలువైన రుణ సెక్యూరిటీలను కొనుగోలు చేశారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు