ట్రంప్‌ నిర్ణయంతో తక్షణ ప్రమాదమేమీలేదు

2 Mar, 2018 14:41 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ:   స్టీల్‌ దిగుమతులపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై భారత ప్రభుత్వం స్పందించింది. తక్షమే తమ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం వుండదని ఉక్కు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. అమెరికాకు మన ఎగుమతులు కేవలం 2 శాతం మాత్రమేననీ,  ప్రస్తుతానికి ఎలాంటి భారం పడదని  ఉక్కు శాఖ కార్యదర్శి అరుణ్‌ శర్మ చెప్పారు. 

అన్ని దేశాలు అమెరికా  పద్ధతిని పాటిస్తే   నిస్సందేహంగా అంతర్జాతీయ వాణిజ్య క్రమంలో తీవ్రప్రభావాన్ని చూపిస్తుందని చైనా  విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చున్‌  యింగ్‌  శుక్రవారం వ్యాఖ్యానించారు.   చైనా ఐరన్ అండ్ స్టీల్ అసోసియేషన్ వైస్-సెక్రటరీ జనరల్ లి జిన్‌ చాంగ్‌ మాట్లాడుతూ, చైనాపై ప్రభావం పెద్దగా ఉండదన్నారు.

కాగా అమెరికా ప్రభుత్వం   స్థానికి ఉత్పత్తిదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై భారీగా సుంకం విధించే యోచనలో ఉంది. చైనా, యూరోప్,  పొరుగు దేశం కెనడా లాంటి  ప్రధాన వాణిజ్య భాగస్వాముల   స్టీల్‌ దిగుమతులపై భారీ సుంకం విధించనున్నామని  ట్రంప్ గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.  ప్రధానంగా చైనాలాంటి దేశాలనుంచి గతకొన్ని  దశాబ్దాలుగా    అమెరికా స్టీల్‌ అల్యూమినియం కంపెనీలు అగౌరవానికి గురయ్యారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. అందుకే దేశరక్షణ కోసం  గొప్ప గొప్ప  స్టీల్ మేకర్స్, అల్యూమినియం మేకర్స్ తయారు  కావాలన్నారు.   అమెరికాలో ఉక్కు , అల్యూమినియం పరిశ్రమలను పునర్నిర్మిం చాలని ట్రంప్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు