రూ.47,000 వద్ద స్థిరంగా పసిడి ధర

26 May, 2020 10:41 IST|Sakshi

మంగళవారం బంగారం ధరలు స్థిరంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం 10:22 గంటల ప్రాంతంలో దేశీయ మల్టీకమోడిటీ మార్కెట్లో శుక్రవారంతో పోలిస్తే 10 గ్రాముల పసిడి ధర రూ.14పెరిగి రూ.47,051 వద్ద ట్రేడ్‌ అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర స్వల్పంగా పెరిగింది. శుక్రవారం ముగింపుతో పోలిస్తే 5 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,731.85 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.అంతర్జాతీయంగా ఇప్పటికీ ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగానే ఉండడంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. అందువల్ల బంగారం ధర పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Related Tweets
మరిన్ని వార్తలు