బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, గెయిల్‌ షేర్లను కొనవచ్చు: మోతీలాల్‌ ఓస్వాల్‌

27 Jun, 2020 16:45 IST|Sakshi

ఐటీ, బ్యాంక్‌, ఇంధన షేర్ల జోరుకు సానుకూల అంతర్జాతీయ సంకేతాలు జత కావడంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌ వరుస రెండు రోజుల నష్టాలకు ముగింపు పలికింది. సెన్సెక్స్‌ 329 పాయింట్లు ఎగసి 35,171 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 10,383 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక వారం పరంగా చూస్తే ఇది వరుసగా నాలుగో లాభాల ముగింపు వారం. వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 440 పాయింట్లు, నిఫ్టీ 139 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. వచ్చే వారంలో నిఫ్టీకి అధిక గరిష్ట స్థాయిల వద్ద ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ రెండు స్టాకులను సిఫార్సుల చేసింది. 

1.షేరు పేరు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.65
కాల పరిమితి: ఒక ఏడాది 
విశ్లేషణ: కోవిడ్‌-19 వ్యాప్తితో స్థూల ఆర్థిక వ్యవస్థలో సవాళ్లు నెలకొనవడంతో వృద్ధి, క్రెడిట్‌ నాణ్యత అవుట్‌లుక్‌లు ప్రభావితమయ్యాయి. ఆస్తుల వర్గీకరణ కలిసిరావడంతో ఈ త్రైమాసికలో బ్యాంక్‌ నాణ్యమైన అసెట్‌ క్వాలిటీ నిష్పత్తులను, మెరుగైన ప్రొవిజనింగ్‌ కవరేజ్‌లను ప్రకటించింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రుణవ్యయం మరింత అధికంగా ఉంటుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ నిపుణులు అంచనా వేసింది. 

షేరు పేరు: గెయిల్‌
బ్రోకరేజ్‌ సం‍స్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌: కొనవచ్చు
టార్గెట్‌ ధర: రూ.110
కాల పరిమితి: ఒక ఏడాది
విశ్లేషణ: గెయిల్‌ ప్రధాన సరఫరా వ్యాపారాలైన పెట్రోకెమికల్స్‌, ఎల్‌పీజీ, లిక్విటిడీ హెడ్రోకార్బన్‌ విభాగాలు ఈ మార్చి త్రైమాసికంలో అంచనాలు మించి ఫలితాలను సాధించినట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తలు