యూత్‌ను ఆకట్టుకునేలా జావా బైక్స్‌ త్వరలో

1 Nov, 2018 12:01 IST|Sakshi

చెకోస్లోవేకియా బైక్‌ బ్రాండ్‌ జావా మళ్లీ భారతమార్కెట్లలో హల్‌చల్‌ చేయనుంది. నవంబరు 15న ఈ జావా మోటార్‌సైకిళ్లు భారతీయ యూత్‌ను ఆకట్టుకునేందుగా సరికొత్తగా ముస్తాబై దూసుకురానున్నాయి. ఈ సందర్భంగా అప్‌కమింగ్‌ బైక్‌ డెస్ట్‌ డ్రైవ్‌ నిర్వహించింది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌  క్లాసిక్‌ 350 సీసీ బైక్‌కు పోటీగా జావా 300 బైక్‌ను కంపెనీ లాంచ్‌ చేయనుంది.

ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు  293 సీసీ సింగిల్‌ సిలిండర్‌, 27బీహెచ్‌పీ, గరిష్టంగా 28ఎన్‌ఎం టార్క్‌, 6 స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌, 18 అంగుళాల ఎంఆర్‌ఆఫ్‌​ టైర్లు, డిస్క్ బ్రేక్‌, రియర్‌ డ్రమ్‌ బ్రేక్‌ సెటప్‌తో రానుంది. అయితే ఏబీఎస్‌ (ఆటోమేటిక్‌ బ్రేకి సిస్టం) ను అమర్చిందీ లేనిదీ స్పష్టతలేదు.  ఇక ధర విషయానికి వస్తే రూ.1.5 - రూ.1.75 లక్షల (ఎక్స్‌-షోరూం)  ఉండొచ్చని  మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

కాగా1929లో తయారైన ఈ జావా మోటారు సైకిల్‌కు ప్రపంచవ్యాప్తంగా లభించిన ఆదరణ అతా  ఇంతా కాదు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు సమానంగా క్రేజ్‌ను సంపాదించుకుంది.  అయితే 1990ల తర్వాత మార్కెట్‌లో కనుమరుగైనా బైక్‌ లవర్స్‌ గుండెల్లో మాత్రం  పదిలంగా ఉంది.  ఈ నేపథ్యంలోనే మహీంద్ర గ్రూపు ఈ ఐకానిక్‌ జావా బ్రాండ్‌ను తిరిగి లాంచ్‌ చేస్తోంది. 
 

మరిన్ని వార్తలు