విదేశీ ఆస్తుల వివరాలు ఇవ్వండి

26 Oct, 2016 01:34 IST|Sakshi
విదేశీ ఆస్తుల వివరాలు ఇవ్వండి

మాల్యాకు సుప్రీం నెల గడువు

 న్యూఢిల్లీ: విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను నాలుగు వారాల్లో తెలియజేయాలని ‘ఉద్దేశపూర్వక రుణ ఎగవేతల పారిశ్రామికవేత్త’ విజయమాల్యాను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. మాల్యా తన ఆస్తుల వివరాలను వెల్లడించలేదన్న విషయం వివిధ అంశాల ప్రాతిపదికన స్పష్టమవుతోందని జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌లతో కూడిన  ధర్మాసనం పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్ సంస్థ డియోజియో నుంచి పొందిన 40 మిలియన్ డాలర్లకు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించలేదని వివరించింది. మొత్తంగా చూస్తే ఆస్తుల వెల్లడికి సంబంధించి 2016 ఏప్రిల్ 7న తాము ఇచ్చిన ఉత్తర్వులను మాల్యా తగిన విధంగా అమలు పరచలేదన్న విషయం స్పష్టమవుతున్నట్లు వెల్లడించింది. కోర్టు ఆదేశాల మేరకు దేశంలో ఆస్తుల వివరాలను మాల్యా ఇప్పటికే వెల్లడించారు. అయితే వీటిలో సమగ్రత లేదని బ్యాంకింగ్ వాదిస్తోంది. కేసు తదుపరి విచారణ నవంబర్ 24కు వాయిదా పడింది.

మరిన్ని వార్తలు