వాట్సాప్‌ యూజర్లకు మరో కొత్త ఫీచర్‌

8 Jun, 2018 13:46 IST|Sakshi

ఎప్పడికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో అలరిస్తున్న వాట్సాప్‌ తాజాగా మరో అ‍ద్భుత ఫీచర్‌ తీసుకొచ్చింది. వాట్సాప్‌ యూజర్లను పదే పదే విసుగిస్తున్న ఫార్వర్డెడ్‌ మెసేజ్‌ల బారి నుంచి తప్పించడానికి ‘ఫార్వర్డెడ్‌ లేబుల్‌ ఫీచర్‌’ను లాంచ్‌ చేసింది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ బీటా యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌తో ఫార్వర్డ్‌ మెసేజ్‌లకు ఓ లేబుల్‌ ఉంటుంది. దీంతో రెగ్యులర్‌ మెసేజ్‌లకు, ఫార్వర్డ్‌ మెసేజ్‌లకు తేడా తెలుసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ను యాక్సస్‌ చేసుకోవడానికి ఎలాంటి ప్రక్రియ అవసరం లేదు. కేవలం బీటా యూజర్లు తమ వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి అప్‌డేట్‌ అయిన తర్వాత మెసేజ్‌ టాప్‌లో ఫార్వర్డ్‌ లేబుల్‌ ఉంటుంది. కొంతమంది వ్యక్తులు గ్రూప్‌ల్లో గుడ్‌మార్నింగ్‌ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేస్తూ.. మన ఫోన్‌ మెమరీని స్పామ్‌ చేస్తూ ఉంటారు. దీన్ని కొంతమేర తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగపడనుంది. 

2.18.179 వాట్సాప్‌ బీటా వెర్షన్‌కు ఇది అందుబాటులో ఉంది. ప్రస్తుతం వాట్సాప్‌, 25 సార్లు కంటే ఎక్కువ సార్లు ఫార్వర్డ్‌ అయితే కానీ మెసేజ్‌ను బ్లాక్‌ చేయలేదు. దీంతో స్పామ్‌ పోస్టులు విపరీతంగా ఫార్వర్డ్‌ అవుతూ ఉన్నాయి. మరోవైపు పేమెంట్‌ సర్వీసులను కూడా భారత్‌లో ఆవిష్కరించాలని వాట్సాప్‌ ప్లాన్‌ చేస్తోంది. కానీ కేంబ్రిడ్జ్‌ అనలిటికా స్కాంతో ఈ ఫీచర్‌ లాంచ్‌ చేయడానికి కాస్త సమయం తీసుకునేలా ఉంది. అయితే ఎప్పుడు ఈ సర్వీసులను లాంచ్‌ చేస్తుందో ఇంకా స్పష్టతలేదు. తాజాగా వాట్సాప్‌ తీసుకొచ్చిన అప్‌డేట్‌లో ఎక్కువ సేపు పాటు వాయిస్‌ మెసేజ్‌లను రికార్డు చేయడం, ఫింగర్‌ను నొక్కి పట్టాల్సి అవసరం లేకుండా మెసేజ్‌లను రికార్డు చేయడం వంటి ఫీచర్లు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు