ఇన్‌స్టా కొత్త ఫీచర్ గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

26 Oct, 2023 17:37 IST|Sakshi

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్) ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ.. కొత్త ఫీచర్స్ పొందుతున్నాయి. తాజాగా మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు ఓ కొత్త ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా చిన్న వీడియోను రికార్డ్ చేయవచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌కు సంబంధించిన ఓ చిన్న సెల్ఫీ వీడియోను ఆడమ్ మోస్సేరి తన అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇందులో అదెలా పనిచేస్తుందో చూడవచ్చు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత వినియోగదారుడు డిఫాల్ట్ ప్రొఫైల్ ఫోటోను లూపింగ్ వీడియోతో నోట్స్‌లో అప్‌డేట్ చేయగలుగుతారు.

ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్‌.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్‌మెంట్‌ కొనేసింది!

డెమో వీడియో ప్రకారం, వినియోగదారులు నోట్‌ని క్రియేట్ చేయడం ప్రారంభించినప్పుడు ప్రొఫైల్ ఫోటో పక్కన కెమెరా సింబల్ ఉంటుంది. దీని నుంచి వీడియో రికార్డ్ చేసి నోట్స్‌లో పోస్ట్ చేయవచ్చు. ఇది తప్పకుండా వినియోగదారులను ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము.

మరిన్ని వార్తలు