ఉద్దేశపూర్వక ఎగవేతలు రూ.92,000 కోట్లు

16 Aug, 2017 01:05 IST|Sakshi
ఉద్దేశపూర్వక ఎగవేతలు రూ.92,000 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులకు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతలు 20% పెరి గిపోయాయి. 2016–17 ఆర్థిక సంవత్సరం చివరికి 9,000 మంది రూ.92,376 కోట్ల మేర బ్యాంకులకు ఎగ్గొట్టారు. 2016 మార్చి నాటికి ఇలా ఉద్దేశపూర్వకంగా చెల్లించని రుణాల మొత్తం రూ.76,685 కోట్లుగానే ఉన్నాయి. ఇక ఉద్దేశపూర్వక ఎగవేత కేసులు గతేడాది మార్చి నాటికి 8,167గా ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి వాటి సంఖ్య 8,915కు పెరిగింది. వీటిలో రూ.32,484 కోట్ల ఎగవేతలకు సంబంధించి రూ.1,914 కేసులపై బ్యాం కులు కేసులు దాఖలు చేయించాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 27ప్రభుత్వ రంగ బ్యాంకు లు (ఎస్‌బీఐ, దాని లో విలీనమైన అనుబంధ బ్యాంకులు సహా) రూ.81,683 కోట్ల మొండి బాకీలను రద్దు చేయడం గమనార్హం. అంతకుమందు ఏడాదితో పోలిస్తే ఇది 41 % అధికం.
 

>
మరిన్ని వార్తలు